యాచారం: పొట్టకూటి కోసం పట్నం వలసవెళ్లిన కుటుంబం బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ కోసం స్వగ్రామానికి బైక్పై వస్తున్నారు. మార్గ మధ్యలో బతుకమ్మను పేర్చడానికని పూలు కొనుగోలు చేస్తుండగా వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలివీ.. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన కొంగళ్ల పద్మ(45) మల్లేష్ దంపతులు కొన్నేళ్లుగా పొట్టకూటి కోసం నగరంలోని బండంగ్పేటలో అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నారు. దసరా పండుగ కోసమని ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి బైక్పై బయలుదేరారు. చౌదర్పల్లి గేట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు రాగానే బతుకమ్మను పేర్చడానికని పూలు కొనుగోలు చేయడానికని ఆగారు. పూలు కొని తిరిగి బైక్ ఎక్కుతుండగా ఇబ్రహీంపట్నం నుంచి యాచారం వైపు అతి వేగంగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిపోయిన పద్మ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మరికొద్ది నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటామనే సంతోషంలో ఉన్న భార్య తన కళ్ల ముందే మృతి చెందడంతో భర్త మల్లేష్ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి తరించారు. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


