మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

కోటి రూపాయల నష్టం!

మాదాపూర్‌ : మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం యాంటీ డ్రోన్‌ పరీక్షలకు సంబంధించిన పరికరాలను సిద్ధం చేస్తున్న యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన మేరకు.. రక్షణ, సైనిక అవసరాల కోసం యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను తయారు చేసి సరఫరా చేసే కంపెనీ ఇది. గోదాములో మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన కంపెనీ ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతుల నిమిత్తం విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ కారణంగా కూలింగ్‌ వ్యవస్థపై ప్రభావం పడి బ్యాటరీలు అధికంగా వేడెక్కి మంటలు చెలరేగి (షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల) ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు, దర్యాప్తు అనంతరమే అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు. సుమారుగా కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement