సాయన్న జయంతిని ఘనంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

సాయన్న జయంతిని ఘనంగా నిర్వహిద్దాం

Oct 19 2026 7:47 AM | Updated on Oct 19 2026 7:47 AM

సాయన్న జయంతిని ఘనంగా నిర్వహిద్దాం పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు విద్యావంతులతోనే వ్యవస్థలో మార్పు ఘనంగా ఆయుధ పూజ

చేవెళ్ల: పండుగల సాయన్న జయంతి వేడుకలను ఈనెల 22న ఘనంగా నిర్వహించుకోవాలని ముదిరాజ్‌ కార్పారేషన్‌ చైర్మన్‌ బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ పిలుపునిచ్చారు. చేవెళ్లలో ఆదివారం ఆయన ముదిరాజ్‌ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగల సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ముదిరాజ్‌ల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు తలారి మల్లేశ్‌, మండల అధ్యక్షుడు నర్సింలు, యువజన సంఘం అధ్యక్షుడు తెలుగు శ్రీనివాస్‌, ఊరడి నర్సింలు, రాంప్రసాద్‌, గోపాల్‌, శంకర్‌పల్లి అధ్యక్షుడు మైసయ్య, షాబాద్‌ అధ్యక్షుడు గోపాల వెంకటేశ్‌, జనార్దన్‌ పాల్గొన్నారు.

మంచాల: పండుగ పేరుతో రాష్ట్రపక్షి పాలపిట్టను బంధించి హింసిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సీఐ మధు ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ రోజు పాలపిట్టను చూడాలని పట్టుకోవాలని ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. కొంతమంది ప్రజల సందర్శనార్థం పట్టుకొచ్చి గ్రామాల్లో ప్రదర్శిస్తారని, ఇలాంటివి చేయకూడదన్నారు. వన్యప్రాణి చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది జంగారావు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: విద్యావంతులతోనే వ్యవస్థలో మార్పు వస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకొని ఉత్తమ వ్యక్తికి చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ కార్యక ర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాద్‌రావు, జిల్లా అధ్యక్షుడు రమేష్‌, మండల అధ్యక్షుడు వెంకటయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు శరత్‌కుమార్‌ రెడ్డి, ఘనపురం వెంకటయ్య గౌడ్‌, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల సౌమ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆదివారం ఎస్పీ స్నేహమెహ్ర ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. బెల్‌ ఆఫ్‌ ఆర్మ్‌లో భద్రపరిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పోలీసు వాహనాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్‌ మీనా, ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement