ధారూరు: చెరువులో నీళ్లు తాగుడానికి వచ్చిన దుప్పిని చంపి, మాసం వండుకుని తిన్న ఆరుగురు వ్యక్తులపై వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్ తెలిపిన వివరాలు ఉన్నాయి.. మండల పరిధిలోని లక్ష్మీనగర్‌తండాకు చెందిన కిషన్‌నాయక్, లక్ష్మణ్‌నాయక్ ధారూరు ఫారెస్ట్ కంచె సమీపంలో శుక్రవారం రాత్రి అటవీ జంతువుల వేట కోసం ఉచ్చు బిగించారు. అటుగా వచ్చిన ఓ అడవి దుప్పి ఇందులో చిక్కుకుని చనిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కిషన్‌నాయక్, రఘు దుప్పిని తీసుకెళ్లి మాంసాన్ని ముక్కలు చేశారు. ఇద్దరూ కొంత తీసుకుని మిగిలినది లక్ష్మణ్‌నాయక్, విజయ్, చందర్, గోపాల్‌కు పంచిపెట్టారు. శనివారం ఉదయాన్నే ఆయా కుటుంబాల వారు మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ మేరకు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన అధికారులు కిషన్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని శనివారం వికారాబాద్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఇతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పరిగి జైలుకు తరలించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.
ఒకరి రిమాండ్.. పరారీలో ఐదుగురు


