ఓట్లు..పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఓట్లు..పాట్లు

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పార్కులు మొదలు స్టడీ సెంటర్ల వరకు చక్కర్లు ఎక్కడ కలిస్తే అక్కడ పట్టుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి స్మార్ట్‌గా వాట్సాప్‌లోనూ దరఖాస్తు ఫారాల పంపిణీ స్కాన్‌ చేస్తే చాలు.. దరఖాస్తులు ప్రత్యక్షం వివరాలు నమోదు చేస్తే బ్యాకెండ్‌ టీం ద్వారా ఓటు నమోదు

ఆదివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పట్టభద్రుల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఓటర్ల జాబితాలో డిగ్రీలున్న వారి పేర్ల నమోదు చేయించేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. అధికార కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ పోలింగ్‌ బూతుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఓటరు నమోదు ఫారాలు సహా ల్యాప్‌టాప్‌లు చేతుల్లో పట్టుకుని తెల్లవారు జాము నుంచే పార్కులు, వ్యాయామ, యోగ శిక్షణ కేంద్రాలు సహా కోచింగ్‌ సెంటర్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. పట్టభద్రులు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని డిగ్రీ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్‌, ఓటరు కార్డులోని ఎపిక్‌ నంబర్‌ సేకరిస్తున్నారు. ఆయా వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తర్వాత తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాల్సిందిగా కోరుతూ వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, వాయిస్‌కాల్స్‌ రూపంలో అభ్యర్థిస్తున్నారు. హైరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సురభివాణిదేవి పదవీకాలం 2027 మార్చి 27తో ముగియనుంది. ఖాళీ స్థానానికి మార్చి 29లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే (సెప్టెంబర్‌ 28న) ఎన్నికల కమిషన్‌ ఓటర్ల నమోదు షెడ్యూల్డ్‌ విడుదల చేసింది.

ముఖ్యనేతలను కలుస్తూ..

మద్దతు కూడగడుతూ..

అధికార కాంగ్రెస్‌ ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి చెందిన సామ రామ్మోహన్‌రెడ్డి పేరు వెల్లడించింది. ఆయన కూడా రోజుకో నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఓటర్ల నమోదుపై చర్చిస్తున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ వర్సిటీ, తెలుగు వర్సిటీ సహా ఎస్‌ఐ, గ్రూప్స్‌, కానిస్టేబుల్‌ కోచింగ్‌ సెంటర్లను చుట్టేస్తున్నారు. పట్టభద్రులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.

వ్యూహాత్మకంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌

అభ్యర్థిని ప్రకటించి, పట్టభద్రులను పట్టుకునే ప్రయత్నంలో అధికార పార్టీ కొంత ముందుండగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తూ.. మరోవైపు ఓటరు జాబితాలో పట్టభద్రుల పేర్ల నమోదు కోసం ముఖ్య నేతలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, అడ్వకేట్లు, నిరుద్యోగులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. 2021 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి వివరాలు సేకరించి, మరోసారి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పిస్తున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒకవైపు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ.. మరోవైపు ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైతే పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని, పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ.. యువతకు దగ్గరగా ఉన్న నేతను నిలబెట్టాలనే వాదన కూడా పార్టీ అంతర్గత వేదికల్లో విస్తృతంగా జరుగుతోంది.

పట్టభద్రుల కోసం నేతల వెతుకులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement