అక్రమ నిర్మాణాలు సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలు సహించేది లేదు

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎస్‌ఐ నందకిషోర్‌ హెచ్చరించారు. ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధి ఆదిభట్లలోని టీసీఎస్‌ ఎదురుగా అక్రమంగా చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా నందకిషోర్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేత లు చేపట్టినట్టు తెలిపారు.అనుమతులు జీ ప్లస్‌ టుకు మాత్రమే తీసుకొని నాలుగు,ఐదు అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం తగదన్నారు. ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకొని ఏ కంగా కమర్షియల్‌ భవనాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అ దిభట్ల సర్కిల్‌ టీపీఓ రఘునాథ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రాకేష్‌,రూపేష్‌, సహాయకులు నరేందర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మొండిగౌరెల్లి వాసికి యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అవార్డు

యాచారం: మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన పర్సమోని శ్రీనివాస్‌ ముదిరాజ్‌కు తెలంగాణ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును శనివారం నగరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నిర్మాత దిల్‌రాజ్‌, డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ తదితరులు అవార్డుతో పాటు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. పర్సమోని శ్రీనివాస్‌ ముదిరాజ్‌ తెలంగాణ ప్రాంత జీవన వైవిద్యం, కళాకారుల జీవనోపాధులు, తెలంగాణ యాస పాటలు అందించారు. తాజాగా అమ్మ నవ్వింది పాటకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. అవార్డు రావడంపై యాచారం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ

యాచారం: మండల పరిధిలోని కుర్మిద్దలో ఎన్‌ఐయూఎం భవన నిర్మాణ శంకుస్థాపనకు సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో కార్యక్రమం రద్దయింది. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం పర్యటన ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో శనివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, రెవెన్యూ, మున్సిపల్‌, టీజీఐఐసీ ఉన్నతాధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. ఎన్‌ఐయూఎంకు కేటాయించిన స్థలాన్ని అధి కారులు సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, సమావేశపు నిర్మాణం, పార్కింగ్‌ వంటి విషయాలపై అధికారులు చర్చించారు.

ఓయూ పీహెచ్‌డీలో ఏఐ

డిగ్రీ, పీజీ కోర్సుల్లో మార్పులపై వీసీ దృష్టి

ఉస్మానియా యూనివర్సిటీ: వర్సిటీ స్థాయి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల నిర్వహణలో మార్పులపై వీసీ ప్రొ.కుమార్‌ దృష్టి సారించారు. పీహెచ్‌డీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రీసెర్చ్‌ మెథడాలజీ, పబ్లిషింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఎథిక్స్‌లతో పాటు బ్రాడ్‌ ఏరియా ఆఫ్‌ రీసెర్చ్‌ అంశాలు చేర్చనున్నట్లు తెలిపారు. శని వారం ఓయూ పాలనా భవనంలో డీన్లు, హె డ్స్‌, బీవోఎస్‌ ఛైర్మన్లు, ప్రొఫెసర్లతో అకాడమిక్‌ అంశాలపై చర్చించారు. మార్కెట్‌ అవసరాల ను అనుగుణంగా డిగ్రీ,పీజీ కోర్సులను మార్చ డం, పీహెచ్‌డీ కోర్సు వర్క్‌లో భాగంగా ప్రస్తు తం కొనసాగుతున్న రెండు సబ్జెక్టుల విధానాన్ని నాలుగు అంశాలతో కూడిన 12 క్రెడిట్ల విధానంగా మార్చే ప్రతిపాదనలపై చర్చించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా సకాలంలో పరీక్ష ఫలితాలు, పరిపాలన సామర్థ్యం పెంపు, విద్యా, పాలన ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, నిర్ణీత కాలంలో జవాబుదారీతనంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సీపీఆర్వో ప్రొ.ప్యాట్రిక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement