ఇబ్రహీంపట్నం: వర్షాభావ పరిస్థితులు, ఉక్కపోతతో సతమతమవుతున్న ఇబ్రహీంపట్నం ప్రజలకు శనివారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షం ఉపశమనం కలిగించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలం కాస్తా ఎండా కాలాన్ని తలపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో ఫ్యాన్లు, కూలర్లు విరామం లేకుండా పనిచేస్తున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గాలులతో కురిసిన తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటికే మంచినీటి సమస్యలు తలెత్తడంతో వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
చెత్త.. విలువైన వనరు
సాక్షి, సిటీబ్యూరో: ‘వ్యర్థాలను కేవలం తొలగించాల్సిన పదార్థాలుగా కాకుండా, విలువైన వనరులుగా చూడాలి. వాటి పునర్వినియోగం, రీసైక్లింగ్, శాసీ్త్రయ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి’ అని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సూచించారు. సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణకు మున్సిపల్ అధికారులు ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘సామర్థ్య నిర్మాణ శిక్షణ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లో చెత్త సేకరణ, వేరు చేయడం, ప్రాసెసింగ్, పునర్వినియోగం వంటి అంశాలను సమర్థంగా అమలు చేయడం ఈ శిక్షణ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), ఆస్కిల మధ్య శిక్షణ, అధికారుల సామర్థ్యాభివృద్ధి, సుస్థిర వ్యర్థాల నిర్వహణకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, ఆస్కి డైరెక్టర్ జనరల్ ఎన్.రమేష్ కుమార్ ఒప్పంద పత్రాలను మార్పిడీ చేసుకున్నారు.
ఆడబిడ్డలకు సద్దుల
బతుకమ్మ శుభాకాంక్షలు
అనంతగిరి: పూల పండుగ అందరి ఇళ్లలో సుఖసంతోషాలు నింపాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ఆడ బిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు అందించిన ఈ గొప్ప సంస్కృతిని, జీవన విధానాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏటా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.


