కందుకూరు: వర్షాభావంతో ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం అందించి రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి డి.రాంచందర్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని నేదునూరులో శనివారం రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం అలిఖాన్పల్లిలో రైతుల తరఫున పోరాడి ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. వచ్చిపోయే కరెంట్‌తో పాటు భూగర్భ జలాలు అడుగంటి వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కరువును ఆసరా చేసుకుని మిల్లర్లు, వ్యాపారులు బియ్యం ధరలను అమాంతం పెంచేశారని ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు బి.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వంగూరి యాదయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మిద్దె యాదయ్య, సీపీఎం గ్రామ కార్యదర్శి ఎస్.రాములు, రైతులు ఆర్.నరసింహ, ఓ.కృష్ణ, టి.యాదయ్య, పి.కృష్ణ, బి.యాదయ్య, బి.శంకర్, ఎం. యాదయ్య, నరసింహ, పోచమ్మ, కలమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.


