చేవెళ్ల: కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు న్యాయవాదులు కృషి చేయాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నా రు. చేవెళ్ల కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన ఏడీజే ఛాంబర్‌ను శనివారం చేవెళ్ల ఏడీజే శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణకుమార్ మాట్లాడుతూ.. కోర్టుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా పరిధిలోని కోర్టుల్లో దాదాపు 1.30 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నా యని తెలిపారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెంచాలన్నారు. రాజేంద్రనగర్ జిల్లా కోర్టులో ఉన్న మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం జరిగిందన్నారు. న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే అన్ని వసతులతో ప్రశాంత వాతవారణం ఉండాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, జూనియర్ సివిల్ జడ్జి విజయకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మధుసుధన్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశ్, మాజీ అధ్యక్షుడు మోకరం నర్సింలు, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


