నిబంధనల మేరకు సర్‌ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు సర్‌ ప్రక్రియ

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

● ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6,7,8 పరిష్కారం నోటీసుల జారీ ప్రక్రియను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఓటర్ల నుంచి సేకరించిన ధ్రువపత్రాలను నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎన్నికల విభాగం అధికారి రవీంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement