పాలపిట్టను బంధిస్తే చట్టపరమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

పాలపిట్టను బంధిస్తే చట్టపరమైన చర్యలు

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

● చేవెళ్ల డిప్యూటీ రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రవికుమార్‌

చేవెళ్ల: విజయదశమిని పురస్కరించుకొని పాలపిట్టను ఎవరైనా బంధించినా, ప్రదర్శించినా చట్టపరమైన చర్యలు తప్పవని చేవెళ్ల డిప్యూటీ రేంజ్‌ ఫారెస్ట్‌ ఽఅధికారి రవికుమార్‌ హెచ్చరించారు. చేవెళ్ల, శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో శనివారం పాలపిట్ట సంరక్షణపై ముద్రించిన వాల్‌పోస్టర్లను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగకు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఉందని, దీన్ని ఆసరాగా చేసుకొని పాలపిట్టను పట్టుకోవటం, అమ్మడం, ప్రదర్శించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరమని తెలిపారు. ఎవరైనా ఇలా చేస్తే టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ 18004255364, 9803338666 నంబర్లకు సమచారం అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement