అప్పుల బాధతో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఆత్మహత్య

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

అప్పుల బాధతో ఆత్మహత్య రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి తాళం పగులగొట్టి.. బంగారు ఆభరణాల చోరీ

మోమిన్‌పేట: అప్పుల బాధ తట్టుకోలేక ఓ యువకుడు చెట్టుకు ఊరి వేసుకొని మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మొరంగపల్లికి చెందిన రాగన్నోళ్ల మణికాంత్‌రెడ్డి(22) తండ్రి నర్సింహారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదం గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అవిఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనకు గురై తన పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని చూసిన రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతిడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ దత్తాత్రేయ తెలిపారు.

కుల్కచర్ల: ఎదురెదురుగా వస్తున్న టిప్పర్‌, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లూనాపై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఘణాపూర్‌ గేటు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మదాబాద్‌ మండలం గాధిర్యాల్‌ గ్రామానికి చెందిన పక్కిరి మాలిక్‌(35) చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తుంటాడు. వ్యక్తిగత పనుల మీద కుల్కచర్లకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రమేష్‌ పరిశీలించి టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

● బద్లాపూర్‌లో ఘటన

● కేసు నమోదు

బషీరాబాద్‌: ఇంటి తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన శుక్రవారం బషీరాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు కంసాన్‌పల్లి కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ విఠల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బద్లాపూర్‌ గ్రామానికి చెందిన కవిత ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళంతోపాటు బీరువా తాళం కూడా పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన రెండు తులాల బంగారు గుండ్లు, కమ్మలు, ముక్కుపుడక తోపాటు కొంత నగదు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆభరణాలు, నగదు అపహరించినట్లు బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దొంగతనానికి పాల్పడింది గ్రామానికి చెందిన మైనర్లేనని విచారణలో తేలినట్లు తెలిసింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. దొంగిలించిన సొత్తు సైతం రికవరీ చేసినట్లు సమాచారం.

పాలపిట్టను నిర్బంధిస్తే జైలు, జరిమానా

బొంరాస్‌పేట: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను నిర్బంధిస్తే వన్యప్రాణుల సంరక్షణ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని కొడంగల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ యాదగిరి హెచ్చరించారు. శుక్రవారం దుద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమతులు లేకుండా ఎవరూ అడవుల్లోకి వెళ్లరాదని సూచించారు. వన్యప్రాణుల స్వేచ్ఛకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పాలపిట్ట సంరక్షణ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు ఫారూఖ్‌ అలీ, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement