టెంట్‌హౌస్‌లో ప్రమాదవశాత్తు మంటలు | - | Sakshi
Sakshi News home page

టెంట్‌హౌస్‌లో ప్రమాదవశాత్తు మంటలు

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

చేవెళ్ల: ప్రమాదశాత్తు ఓ టెంట్‌హౌస్‌లో మంటలు చెలరేగి టెంట్లు కాలిపోయాయి. ఈ సంఘటన మండలంలోని మీర్జాగూడలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. మీర్జాగూడ గ్రామానికి చెందిన కొమరబండ నర్సింలు గ్రామంలోనే టెంట్‌హౌస్‌ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి పూజచేసి దీపం వెలిగించాడు. మధ్యాహ్నం తరువాత ఏం జరిగిందో కాని దుకాణం మూసి ఉండటంతో అందులో నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. బాధితుడు, స్థానికులు కలిసి దుకాణం తెరిచిచూడగా పూర్తిగా మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే నీళ్లు తెచ్చి మంటలు ఆర్పివేశారు. దుకాణంలో టెంట్లు కాలిపోయాయి. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement