కోనేరులో మునిగిన విద్యార్థిని కాపాడిన సిబ్బంది
పహాడీషరీఫ్: మామిడిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కోనేరులో చక్రతీర్థం పూర్తి కావడంతో స్నానమాచరించిన భక్తులు బయటికి వెళ్లిపోతున్నారు. అదు సమయంలో 12 ఏళ్ల బాలుడు కోనేరులోని నీటిని తలపై పోసుకునే క్రమంలో జారి పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునగడాన్ని అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ప్రవీణ్ గమనించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కోనేరులోకి దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకువచ్చారు. పోలీసుల సమయస్ఫూర్తిని మెచ్చి కమిటీ సభ్యులు వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు.
యాచారం: పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు కాజేసిన వ్యక్తిపై యాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. మండల పరిధిలోని మాల్ గ్రామానికి చెందిన సయ్యద్ సమీర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏడుకొండలు నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. సయ్యద్ సమీర్ పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏడుకొండలును నమ్మించి మొదట నకిలీ రసీదులు సృష్టించి రూ. 2,500 వసూలు చేశాడు. మళ్లీ రూ.7 లక్షలు ఇస్తే పోలీస్ ఉద్యోగం వస్తుందని నమ్మబలికాడు. పరీక్ష రాయనిదే ఉద్యోగం ఎలా వస్తుందని గ్రహించిన ఏడుకొండలు శుక్రవారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సయ్యద్ సమీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
శంకర్‌పల్లి: అనారోగ్యంతో శంకర్‌పల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ భానూరి వెంకట్‌రాంరెడ్డి శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి స్థానిక ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి నివాళి ఆర్పించారు. నిరంతరం ప్రజా సేవా కోసం పరితపించే వారని గుర్తు చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నం: విద్యుత్ తీగలను చోరీ చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. పొల్కంపల్లి సమీపంలోని జనహర్ష క్యూఆర్ ఫెస్‌లో 24 పోల్స్‌కు సంబంధించిన విద్యుత్ తీగలను శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు కత్తిరించుకొని వెళ్లారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని అంచనా. ఈ మేరకు విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చే యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హుడాకాంప్లెక్స్: సేల్‌డీడ్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని సరూర్‌నగర్ తహసీల్దార్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 118 ప్రకారం ఇప్పటికే దరఖాస్తు చేసుకొని, నిర్దేశిత రుసుములు చెల్లించినప్పటికీ ఇంకా కన్వేయన్స్ డీడ్లు (సేల్ డీడ్లు) అమలు కాని సంబంధిత లబ్ధిదారులు తమ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు.


