చేవెళ్ల: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలం, మున్సిపల్ పరిధిలోని 37 మంది లబ్ధిదారులకు వచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్‌పర్సన్ దేవర సమతారెడ్డి, వైస్ చైర్మన్ రాముగౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచులు బి.మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాము లు, కో ఆప్షన్ సభ్యుడు చాన్‌పాష పాల్గొన్నారు.
హైమాస్ట్ లైట్లు ప్రారంభం
మండలంలోని కమ్మెటలో రూ.6లక్షలతో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లను శుక్రవారం ఎమ్మెల్యే కాలెయా దయ్య, స్థానిక సర్పంచ్ ముడ్రిక పద్మామ్మకృష్ణగౌడ్తో కలిసి ప్రారంభించారు. ఉప సర్పంచ్ విష్ణువర్థన్గౌడ్, నాయకులు శశిధర్‌గౌడ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ భవనం ప్రారంభం
మొయినాబాద్ రూరల్: గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎత్మార్పల్లిలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతకింది ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి మాడి రాజేందర్‌రెడ్డి, ఎంపీడీఓ హిమబిందు, పంచాయతీ కార్యదర్శి హర్షిత, పంచాయతీరాజ్ డిప్యూటీ డీఈ విజయ్‌కుమార్, ఏఈ భూపాల్, సర్పంచ్‌లు శ్రీదివ్యమురళీధర్రెడ్డి, రజితరవీందర్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


