పహాడీషరీఫ్: ఐదు రోజులుగా కనుల పండువగా కొనసాగిన మామిడిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఉదయం హవనం అనంతరం భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రతీర్థం చేయించారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుధీర్ కుమార్ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిసాయి. కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్, లాల్ సతీష్ గౌడ్, దామోదర్ సచిన్ సోని, వాసుదేవారెడ్డి, కెంచె లక్ష్మీనారాయణ, ధర్మారెడ్డి, గుర్జని గణేశ్ గౌడ్, సురేష్ గౌడ్, ఎల్.కె.కృష్ణ, సుదర్శన్ యాదవ్, లక్ష్మణ్, నందీశ్వర్, సూరెడ్డి జంగారెడ్డి, శ్రీను రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


