శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

పహాడీషరీఫ్‌: శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా ఆపరేషన్‌ కవచ్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్టు శంషాబాద్‌ డీసీపీ బి.రాజేష్‌ తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశానుసారం జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) జోయల్‌ డేవిస్‌తో కలిసి గురువారం రాత్రి బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన రౌడీషీటర్‌ ఇలియాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. 170 వాహనాలను తనిఖీ చేసి, 18 కేసులు నమోదు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా రాత్రివేళ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. కొందరు యువకులు అకారణంగా రోడ్లపై తిరుగుతూ, అరుగులపై తిష్ట వేసి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం, ట్రాఫిక్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడడడంతో పాటు అవసరమైన పత్రాలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. తనిఖీల్లో ఆదిభట్ల ఏసీపీ డి.వి.ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.నాగరాజు, ఎస్‌ఐలు ప్రసాద్‌, నవీన్‌ కుమార్‌, సొహేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement