అన్‌లోడింగ్‌ చార్జీలు పెంచాలని వినతి | - | Sakshi
Sakshi News home page

అన్‌లోడింగ్‌ చార్జీలు పెంచాలని వినతి

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌లోని హమాలీలకు అన్‌లోడింగ్‌ చార్జీలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. చార్జీలు ప్రతి రెండేళ్లకు ఒకసారి పెంచుతున్నారని, తాజాగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హమాలీ కార్మికులకు అన్‌లోడింగ్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతరాజు నరసింహ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దాసరి ప్రసాద్‌, ఫ్రూట్‌ మార్కెట్‌ హమాలీ వర్కర్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎం.డి.షరీఫ్‌, ప్రధాన కార్యదర్శి కోయకూర చిన్నగౌడ్‌, కోశాధికారి మేతరి పోచయ్య, ఉపాధ్యక్షులు ఎం.డి.షరీఫ్‌, రాజు నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement