శంకర్‌పల్లి: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్‌మాదిగకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. మండలంలోని టంగటూర్‌లో గురువారం ఆయన శివశంకర్‌మాదిగ చిత్రపటానికి నివాళులర్పించి, మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన శివశంకర్ మాదిగ మృతి జిల్లాకు, చేవెళ్ల ప్రాంతంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తీరని లోటన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు ఉపేందర్, రావుగల్ల బాబు, నర్సింహ, ప్రవీణ్‌కుమార్, లింగం సాయి, మల్లేశ్, కుమార్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.


