గంజాయి విక్రేత అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేత అరెస్ట్‌

Oct 15 2026 8:18 AM | Updated on Oct 15 2026 8:18 AM

● 430 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం

● ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రం,బైక్‌, సెల్‌ఫోన్లు సీజ్‌

మొయినాబాద్‌: మండలంలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇతని నుంచి 430 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, స్కూటీ, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అజీజ్‌నగర్‌ సమీపంలోని శ్మశానవాటిక వద్ద బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వ్యక్తి గంజాయి విక్రయించేందుకు శ్మశానవాటిక వద్దకు వస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. క్లూస్‌ టీమ్‌కు సమాచారం అందించి కాపు కాశారు. మధ్యాహ్నం 12గంటలకు ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పట్టుకుని విచారించగా నిందితుడు అంతంగారి అరుణ్‌కుమార్‌గా గుర్తించారు. ఇతను బీదర్‌ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మొయినాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తన స్నేహితులు, ఇతరులకు అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గదిలో గంజాయి

కేశంపేట: మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారులోని ఆర్కాన్‌ మినరల్స్‌ స్టోన్‌ క్రషర్‌ వద్ద గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రామకృష్ణ పటేల్‌ క్రషర్‌లో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇతని గదిలో గంజాయి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా 33 గ్రాముల గంజాయి దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పరమేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement