పోక్సో నిందితుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పోక్సో నిందితుడి ఆత్మహత్య

Oct 15 2026 8:18 AM | Updated on Oct 15 2026 8:18 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: పోక్సో కేసు నమోదైందన్న భయంతో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. అల్మాస్‌గూడలో నివాసం ఉండే రామిడి హర్షవర్ధన్‌రెడ్డి వ్యాపారం చేస్తూ జీవించేవాడు. ఇటీవల మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో ఇతనిపై పోక్సో కేసు నమోదైంది. ధైర్యం చెప్పడానికి మంగళవారం రాత్రి తుర్కయంజాల్‌లోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో ఉన్న తన సోదరి దీపిక ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత హర్షవర్ధన్‌రెడ్డి, బావ మాధవరెడ్డి హాలులో నిద్రించారు. తెల్లవారుజామున జామున 5 గంటల ప్రాంతంలో మాధవరెడ్డి నిద్రలేచి చూసే సరికి హర్షవర్ధన్‌ పక్కన లేడు. ఇంట్లో చూస్తుండగా పడక గదిలో హర్షవర్ధన్‌రెడ్డి(31) చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుడి సోదరి దీపిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా అస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కేసు నమోదైందనే భయంతో ఉరేసుకున్న యువకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement