● ఆకుతోటపల్లివాసుల అభ్యర్థన
● అదనపు కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం
ఆమనగల్లు: మండలంలోని ఆకుతోటపల్లిలో ప్రజాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ఇచ్చిన క్రషర్ ప్లాంట్ అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్మయిని కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వేనంబర్ 302లో క్రషర్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, క్రషర్ ప్లాంట్‌తో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. క్రషర్ ద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పంటలు పాడవుతాయని, వాతావరణ కాలుష్యం నెలకొంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే సర్వే నంబర్ 304లో కొనసాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై విచారణ జరిపించాలని వారు కోరారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ఆకుతోటపల్లి గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో శంతియుతంగా రిలే దీక్షలు చేపడుతుంటే పోలీసులు బలవంతంగా దీక్షశిబిరాన్ని తొలగించారన్నారు. వినతిపత్రం అందించిన వారిలో శ్రీపాతి అమరేశ్‌రెడ్డి, వెంకటయ్య, కృష్ణ, బాలు, శేక్ షాజిద్, శ్రీపాతి శశిధర్‌రెడ్డి, హాజీపాషా తదితరులు ఉన్నారు.


