అభివృద్ధికి కట్టుబడి ఉంటా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి కట్టుబడి ఉంటా

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

చేవెళ్ల: మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డులో రూ.55 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన చైర్‌పర్సన్‌ సమతారెడ్డి, కౌన్సిలర్‌ మనీషాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి, వైస్‌ చైర్మన్‌ రాములు గౌడ్‌, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement