మహేశ్వరం: ఆర్టీసీని ముందుకు నడిపించడంలో కార్మికుల పాత్ర కీలకమని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. మహేశ్వరం ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం ఐఎన్‌టీ యూసీ, ఎస్‌డబ్ల్యూ, టీఎంయూ, ఏడబ్ల్యూఎఫ్ యూనియన్లు బలపర్చిన టీడబ్ల్యూ యూనియన్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్ ప్రెసిడెండ్ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. అంతకు ముందు డిపోలో కార్మి కులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు నడికూడ శివ,పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.
చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్


