ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాసేవలో నిజాయితీ, బాధ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆచరణీయమైవని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్ల: నియోజకవర్గ కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని, ఇది సిగ్గుచేటని సీపీఐ రారష్ట్‌ర నాయకులు ప్రభు లింగం, రామస్వామి అన్నారు. మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డులో గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం శుక్రవారం స్థల పరిశీలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న చేవెళ్లలో మహాత్ముడి విగ్రహం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే నాయకులు స్పందించి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్ గౌడ్, బాబురావ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన చిగురింత పారిజాత నర్సింహారెడ్డిని శుక్రవారం చేవెళ్ల, తాండూరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. జిల్లా అధ్యక్షురాలి బాధ్యతలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
మధుసూదన్‌రెడ్డి
షాబాద్: పల్లెలు, పట్టణాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చందనవెల్లిలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డులు, మాహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మహాలక్ష్మి పథకం ద్వారా యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ సీఐ లక్ష్మిరెడ్డి, సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామితో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడిందన్నారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పార్టీ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నయ్య, రవీందర్‌నాయక్, జనార్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


