టీజీఎంసీ ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

టీజీఎంసీ ఆకస్మిక తనిఖీలు

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

ఆమనగల్లు: నకిలీ వైద్యం, అనధికారికంగా మోడ్రన్‌ మెడిసిన్‌ (అల్లోపతి) ప్రాక్టీస్‌ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీజీఎంసీ) సభ్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం పలు క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోమియోకేర్‌ క్లినిక్‌, శ్రీలక్ష్మీక్లినిక్‌, లైఫ్‌ కేర్‌ పాలీక్లినిక్‌, ప్రణతి క్లినిక్‌, శ్రీ విజయ క్లినిక్‌, శ్రీ విజయ క్లినిక్‌, జేజే హెల్త్‌ క్లినిక్‌, స్వప్న క్లినిక్‌, సాయితిరుమల డయాగ్నస్టిక్‌ సెంటర్‌, సౌజన్య నర్సింగ్‌ హోమ్‌, మదర్‌ థెరిస్సా ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌, మహాలక్ష్మీ హస్పీటల్‌, శ్రీరామ్‌ క్లినిక్‌లో తనిఖీలు చేపట్టారు. ఆయా క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో అవకతవకలను గుర్తించారు. ఈ సందర్భంగా టీజీఎంసీ సభ్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అనధికారికంగా మోడరన్‌ మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు గుర్తించిన వారిపై టీఎంపీఆర్‌ యాక్ట్‌ సెక్షన్‌ 22, ఎన్‌ఎంసీ యాక్ట్‌ సెక్షన్‌ 34, 54 ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌ వంటి ఆయూష్‌ రిజిస్ట్రేషన్‌లు కలిగిన వ్యక్తులు తమకు అనుమతించబడిన పరిధికి వెలుపల మోడరన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న సందర్భాల్లో సంబంధిత విషయాన్ని కాంపిటెంట్‌ ఆయూష్‌ ఆథారిటీ కమిషనర్‌ ఆఫ్‌ ఆయూష్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనర్హులు, అనధికార వ్యక్తులు వైద్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనధికార వైద్యులు, క్లినిక్‌ల సమాచారం ఉంటే టీజీఎంసీ అధికారిక వాట్సాప్‌ 91543 82828 నంబర్‌లో తెలియజేయాలని, పిర్యాధుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement