ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 8లోu నీటిసంరక్షణ ప్రధానం ఇంకుడు గుంతలు నిర్మించుకోండి

మంచాల: భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వీబీజీ రాంజీ పథకం కింద నీటి సంరక్షణ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. మండలంలోని లింగంపల్లిలో శుక్రవారం వీబీజీ రాంజీ పథకంపై నిర్వహించిన గ్రామసభకు అదనపు కలెక్టర్‌ కిరణ్మయితో కలిసి హాజరయ్యారు. ముందుగా గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం భవిష్యత్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉందని, కరువు నివారణ కోసం కృషి చేయాలన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా పాంపాండ్స్‌, ఊట కుంటలు, చిన్న నీటి ఊట కుంటలు, కందకాలు, పూడికతీత పనులు, చెక్‌డ్యాంలు, నీటి ప్రవాహ అడ్డుకట్టల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్‌ మెహన్‌, అదనపు డీఆర్‌డీఏ సుభాషిణి, ఏపీడీ శేషుకుమార్‌, ఎంపీడీఓ వసంతలక్ష్మి, ఏపీఓ వీరాంజనేయులు, సర్పంచ్‌ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధారూరు: ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌వెస్లీ సూచించారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధతో కలిసి మండలంలోని కేరెళ్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం నిర్వహించిన వీబీజీ రాంజీ గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఒక నీటి కుంటను తవ్వించాలని ఎంపీడీఓ నర్సింహులుకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పద్మమ్మ, కార్యదర్శి విజయరాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement