మొయినాబాద్‌రూరల్: మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో కొన్నేళ్లుగా అటెండర్, కాంపౌండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల పశువైద్య కేంద్రం పరిధిలో రెండు ఉప కేంద్రాలు ఉన్నాయి. ఒకటి కనకమామిడి, మరోటి కేతిరెడ్డిపల్లిలో ఉన్నాయి. ప్రస్తుతం కనకమామిడి వెటర్నరీ అధికారి లీవ్‌లో ఉండగా అమ్డాపూర్ వెటర్నరీ అధికారి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి పశువైద్య కేంద్రం 15 ఏళ్ల నుంచి తెరుచుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.


