బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం చివరి శ్వాసలో నలుగురికి ప్రాణం ఆదిభట్ల పీఎస్‌ పరిధిలోకి పలు గ్రామాలు రెవెన్యూ అధికారులపై కేసు నమోదు

చేవెళ్ల: రెండు మున్సిపాలిటీల పరిధిలో మూడు 2బీ బార్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌శాఖ జిల్లా ఫ్యూచర్‌సిటీ సూపరింటిండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో గురువారం చేవెళ్ల సీఐ సీహెచ్‌ కల్పనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, మొయినాబాద్‌ మున్సిపాలిటీల పరిధిలో మూడు 2బీ బార్లలో చేవెళ్లలో ఒక్కటి, మొయినాబాద్‌లో రెండు బార్లకు అనుమతి వచ్చిందన్నారు. ఈ రెండు మూన్సిపాలిటీల పరిధిలో ఉన్న మూడు బార్లకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తులను జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. 16న డ్రాపద్ధతిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుందన్నారు. ఈ బార్ల అనుమతి పొందే వారు రూ.30లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, దీనిని నాలుగు వాయిదాల్లో చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.

కేశంపేట: ఓ కుటుంబం ఉదారత్వం.. నాలుగు కుటుంబాల్లో వెలుగులు నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేశంపేట మండలం సుందరపురం గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్‌రెడ్డి (45) బోర్‌వెల్‌ వ్యాపారం నిర్వహిస్తూ నగరంలోని నాగోలులో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి వస్తుండగా గుర్రంగూడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని యశోద అస్పత్రిలో చేర్పించగా అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. అనంతరం సుందరపురంలో వెంకటేశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య స్వర్ణ, ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం: పునర్విభజనలో భాగంగా ఇబ్రహీంపట్నం పీఎస్‌ నుంచి పలు గ్రామాలను ఆధిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలుపుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని మంగళ్‌పల్లి, రాందాసుపల్లి, చింతపల్లిగూడ, సాహెబ్‌గూడ, ఫెరోజ్‌గూడ ఆధిభట్ల పీఎస్‌ పరిధిలో చేర్చింది. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ప్రజల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యాచారం: తహసీల్దార్‌ అయ్యప్ప, ఉప తహసీల్దార్‌ కీర్తిసాగర్‌, భూభారతి సిస్టమ్‌ ఆపరేటర్‌ నర్సింహాచారిపై కేసు నమోదైంది. నందివనపర్తి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 361లో 8.29 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి (సుమారు రూ. 20 కోట్లకు పైగా.. తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌, భూభారతి సిస్టమ్‌ ఆపరేటర్‌ తమ దాయిదులతో కుమ్మకై ్క, నకిలీ పత్రాలు సృష్టించి ఇబ్రహీంపట్నం సీనియర్‌ సి విల్‌ జడ్జి కోర్టులో తప్పుడు సాక్ష్యాలు సమర్పించి అన్యాయం చేయాలని కుట్ర చేశారని ఎండీ నజీర్‌ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు తహసీల్దార్‌ అయ్యప్ప, ఉప తహసీల్దార్‌ కీర్తిసాగర్‌, భూభారతి సిస్టమ్‌ ఆపరేటర్‌ నర్సింహాచారితో పాటు మరో పది మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement