షాబాద్: మండల పరిధిలోని రేగడిదోస్వాడ పశు వైద్యశాల భవనం పూర్తిగా శిథిలమైంది. ఏ క్షణాన కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భవనం స్లాబ్ కిందిభాగం నుంచి తరచూ సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగులు, ఆస్పత్రికి వస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 30 ఏళ్ల క్రితం పశు వైద్యశాల భవనాన్ని నిర్మించారు. పూర్తిగా శిథిలమైన ఈ భనవనాన్ని వినియోగించొద్దని ఇంజనీరింగ్ శాఖ అధికారులు గతంలోనే సూచించారు. కొత్త భవనం నిర్మాణం విషయమై ఆశాఖ ఉన్నతాధికారులు నాలుగైదేళ్లుగా ప్రయత్నిస్తుండగా, నిధులు మంజూరు కావడంలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఈ భవనంలోనే భయంభయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పశువులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వస్తున్న రైతులు లోపలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
పశువైద్యశాల భవనం పూర్తిగా శిథిలమైంది. కొత్త భవనం నిర్మాణానికి ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించాం. ఈ భవనం పూర్తిగా శిథిలమవడంతో లోపల కూర్చోవాలంటేనే భయంగా ఉంది. రైతులు కూడా లోపలికి రావాలంటే జంకుతున్నారు.
– డాక్టర్ జ్యోష్న,
పశువైద్యాధికారి, రేగడిదోస్వాడ


