పశువైద్యం.. దైన్యం | - | Sakshi
Sakshi News home page

పశువైద్యం.. దైన్యం

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పశు వైద్యం దీన స్థితికి చేరింది.. వైద్య సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది.. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయడం లేదు.. పలుచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి.. ఉన్నవారితో, అరకొర మందులతో నెట్టుకొస్తున్నారు.. సుస్తీ చేసిన పశువులకు ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం సంగతేమో కానీ.. కనీసం మందులు అందుబాటులో ఉండటం లేదు. సాధారణ వ్యాధుల నివారణకు ప్రైవేటు మెడికల్‌ షాపులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి విధిగా కొనసాగాల్సిన నట్టల నివారణ కార్యక్రమం ఏడాది క్రితమే నిలిచిపోయింది. గర్భంతో ఉన్న ఆవులు, గేదెలకు ఇచ్చే మినరల్‌ మిక్చర్స్‌ అందుబాటులో లేవు. విటమిన్‌ సప్లిమెంట్లు, బీకాంప్లెక్స్‌ మాత్ర లు దొరకడం లేదు. వెటర్నరీ డాక్టర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. మెజార్టీ ఆస్పత్రుల్లో పారామెడికల్‌ స్టాఫ్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో వెంట వచ్చిన రైతులే పశు సహాయకుల అవతారం ఎత్తాల్సి వస్తోంది. మెజార్టీ గోపాలమిత్రలు క్షేత్రస్థాయిలో కన్పించడం లేదు. రైతులే స్వయంగా తమ ఆవులు, గేదెలను ఆటోల్లో ఎక్కించి ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది.

సరైన మందులు లేక..

జిల్లాలో 2.40 లక్షల ఆవులు, 1.67 లక్షల గేదెలు, 7.67 లక్షల మేకలు, 2.57 లక్షల గొర్రెలు, 24.70 కోట్లకుపైగా కోళ్లు ఉన్నట్లు అంచనా. వీటి చికిత్స కోసం నాలుగు ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 46 ప్రాథమిక వె టర్నరీ సెంటర్లు, 5 మొబైల్‌ వెటర్నరీ సెంటర్లు, 87 ఎనిమల్‌ హెల్త్‌సబ్‌ సెంటర్లు ఉన్నాయి. ఇక 137 కుత్రిమ గర్భాధరణ కేంద్రాలు ఉన్నాయి. 45 మంది గోపాలమిత్రలు పని చేస్తున్నారు. వివిధ రుగ్మతలతో బాధపడుతూ చికిత్స కోసం ఆయా ఆస్పత్రులకు ఏటా 10 నుంచి 12 లక్షల పశువులు వస్తున్నాయి. వైద్యులు వాటిని పరీక్షించి, మందులు రాసి పంపుతున్నారు. ఆస్పత్రిలో సరైన మందులు లేకపోవడం, బడ్జెట్‌ ఇవ్వక పోవడంతో రైతులే వాటిని సమకూర్చుకోవాల్సి వస్తుండటం ఇబ్బందిగా మారింది.

పీడిస్తున్న సిబ్బంది కొరత

అందుబాటులో ఉండని వెటర్నరీ వైద్యులు

ఇప్పటికే సగానికిపైగా సబ్‌సెంటర్ల మూత

సకాలంలో చికిత్స అందక మూగజీవాల మృత్యువాత

శిథిలావస్థలో ఆస్పత్రుల భవనాలు

ఆందోళనలో పశుపోషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement