షాద్‌నగర్: క్రీడారంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని నందిగామ మండల పరిధిలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో గురువారం ప్రధానమంత్రి ఖేల్ ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి వర్చువల్‌గా ఉపన్యసించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. క్రీడారంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా యువ క్రీడా శక్తిని ప్రోత్సహించేందుకు దేశ వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహిస్తోందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, ప్రోత్సాహాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా రాష్ట్రంలో సుమారు రూ.30కోట్లతో క్రీడా సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించి క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, ముస్కాన్ ఖాన్, యూనివర్సిటీ డైరెక్టర్లు డాక్టర్ సుశీల్, రజినీకాంత్, సిద్ధార్థ్ దేశ్‌ముఖ్, శ్యాంసుందర్, కిషోర్, నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, కక్కునూరి వెంకటేశ్ గుప్తా, చెంది మహేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ


