నేపాల్ వరదల్లో గల్లంతు
నాగోలు: నేపాల్ పర్యటన నిమిత్తం వెళ్లి.. అక్కడి వరదల్లో గల్లంతైన ఎల్‌బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసినిరెడ్డి (44) జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం అధికారులు స్పందించి తమ కూతురు ఆచూకీ కనుగొని, ఇంటికి చేర్చాలని తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, ప్రేమలతరెడ్డి కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్‌రెడ్డి శుక్రవారం సుహాసినిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


