ఇబ్రహీంపట్నం: భవిష్యత్ తరాలు బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్య నిపుణుడు కేవై రాంచందర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ డా.గున్న రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గోపాల గోశాలలో మొక్కలు నాటారు. మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు సునీల్, మండల విద్యాధికారి హీర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: ప్రపంచ పర్యావరణ దినత్సోవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రకటించిన పర్యావరణ అవార్డుకు చేవెళ్ల మోడల్ స్కూల్ ఎంపికై ంది. నగరంలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో స్కూల్ ఉపాధ్యాయుడు దండ బాణీ మంత్రి కొండా సురేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్‌లో మూడు అవార్డులకు ఎంపిక కాగా అందులో చేవెళ్ల మోడల్ స్కూల్ ఒకటి కావడం విశేషం. అవార్డు వచ్చిన సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నపు రెడ్డి మాట్లాడుతూ.. గ్రౌండ్ చుట్టూ నాటిన మొక్కలతో పరుచుకున్న పచ్చదనం, ప్రశాంతవాతవరణం అవార్డుకు ఎంపికయ్యేలా చేశాయన్నారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.


