ఇబ్రహీంపట్నం రూరల్: ఆత్మరక్షణకు కరాటే అవసరమని విక్టరీ షొటోఖాన్ కరాటే మాస్టర్ ఆర్.మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మాస్టర్ యు.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం బెల్టు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 60 మంది విద్యార్థులు గ్రీన్, అరెంజ్, బ్లూ, బ్రౌన్, బ్లాక్ బెల్టులు సాధించారు. వీరికి బెల్టులతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాస్టర్లు ఎం.వెంకటేశ్, కె.వెంకటేశ్, డీ.మహేశ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
శబరిమల క్షేత్రంలో పట్నం
తాండూరు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి శబరిమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నా రు. పంబ ప్రాంతం నుంచి అయ్యప్పస్వామి దర్శనం కోసం కాలినడకన శబరిమల కొండకు వెళ్లి ఆది వారం రాత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. పట్నం మహేందర్‌రెడ్డితోపాటు కుమారుడు రినీష్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
ఆత్మరక్షణకు కరాటే దోహదం
కొడంగల్ రూరల్: చదువుతోపాటు విద్యార్థులు క్రీడలు కరాటేలో రాణించడం ద్వారా ఆరోగ్యంతోపాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని సెకండ్ ఎస్‌ఐ సత్యనారాయణరాజు అన్నారు. ఆదివారం కేఎస్‌ఎస్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. పెద్దనందిగామ, రుద్రారం, చిట్లపల్లి యూపీఎస్, మాటూర్ యూపీఎస్, అప్పాయిపల్లి యూపీఎస్‌లకు సంబంధించిన 60 మంది విద్యార్థులు కరాటే గ్రేడింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన చిన్నారులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, తద్వారా విద్యార్థులు చదువులో రాణించేందుకు అవకావం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు శ్రీనివాస్, మల్లేశ్, మోనిశ్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో తరగతి గదులు ప్రారంభం
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మారెపల్లి గేటు వద్ద కేజీబీవీలో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆదివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మారెపల్లి గేటు వద్ద ఉన్న ఆరే మైసమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, సర్పంచ్ మంగళి సునీత, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, నాయకులు శోభరాణి, లొంక నర్సింలు, గోపా ల్‌రెడ్డి, కరణం పురుషోత్తంరావు, ఉప్పరి మల్లేశం, ఎల్లారెడ్డి, రియాజ్, హరీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
బంట్వారం: దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. ఆదివారం కోట్‌పల్లి మండలంలోని బార్వాద్‌లో ఎల్లమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవానికి ఆమె హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ దైవభక్తిని అలవర్చుకొని సన్మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రతిభ, కాంగ్రెస్ నాయకులు రాంచంద్రారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో చిన్నారిని నేలకేసి బాది..
జగద్గిరిగుట్ట: పెద్దల గొడవ చిన్నారి ప్రాణం మీదకు వచ్చింది. జగద్గిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ వెంకటేశం తెలిపిన మేరకు.. దేవమ్మ బస్తీ, కట్ట మైసమ్మ నగర్‌లో ఉండే కృష్ణవేణికి ముగ్గురు పిల్లలు. కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉంటుంది. గాలిపోచమ్మ బస్తీకి చెందిన శివ తరచుగా కృష్ణవేణి ఇంటివద్దకు మద్యంతాగి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం కూడా తాగి వచ్చాడు. ఇద్దరి మధ్యా గొడవ ముదరడంతో కోపంతో కృష్ణవేణి చిన్న కూతురు వెన్నల(4)ను అమాంతం పైకి లేపి కింద పడేసి కొట్టాడు. దీంతో చిన్నారి తలకు తీవ్రంగా గాయాలై అపస్మారక స్తితిలో పడిపోయింది.స్థానికులు శివనుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.


