యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

యువకుడిని బలిగొన్న వివాహేతర సంబంధం

Mar 16 2026 8:56 AM | Updated on Mar 16 2026 8:56 AM

కుల్కచర్ల: వివాహేతర సంబంధం ఓ యు వకుడిని బలిగొంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె రమేశ్‌(22)కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉంది. గతంలో కుటుంబ సభ్యులు మందలించడంతో రమేశ్‌ ఆమెను దూరంగా పెట్టాడు. కానీ కొంతకాలంగా ఆమె యువకుడికి ఫోన్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేంది. ఈ క్రమంలో 13వ తేదీ సాయంత్రం ఫోన్‌ చేసి రమేశ్‌ను పిలిపించుకుంది. అదే సమయంలో మాటువేసిన సదరు మహిళ కుటుంబసభ్యులు(అన్న, తమ్ముడు, భర్త) రమేశ్‌ను తీవ్రంగా కొట్టడంతో అక్కడి నుంచి ఎటో పారిపోయాడు. దీంతో మనస్తాపంతో అతడు ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ మేరకు తన కొడుకు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి సత్యమ్మ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement