
బాలాపూర్ గణేశుడి దర్శనానికి రండి
బడంగ్‌పేట్: ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుడి దర్శనానికి రావాలని ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం మర్యా దపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. సీఎంను కలిసినవారిలో కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత, ఉత్సవ సమితి అధ్యక్షు డు కళ్లెం నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నేత్రోనిలనంతో మహాశక్తి గణపతికి ప్రాణ ప్రతిష్ఠ
ఖైరతాబాద్: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి సోమవారం ఉదయం 10.30 గంట లకు కంటి పాపను అమర్చి శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే చేశామని, ఈసారి మహాగణపతిని దర్శించుకునే భక్తులకు అన్ని విఘ్నా లు తొలగిపోవడంతో పాటు విశ్వశాంతి నెలకొనేందుకే విశ్వశాంతి మహా గణపతిగా నామకరణం చేసినట్లు విఠల్ శర్మ సిద్ధాంతి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి సాయంత్రం ఆగమన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా మరాఠా బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

బాలాపూర్ గణేశుడి దర్శనానికి రండి