
పోలీసుల అత్యుత్సాహం తగదు
అబ్దుల్లాపూర్‌మెట్: న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. అరెస్టులు, కేసులకు ఎర్రజెండా భయపడదన్నారు. అనాజ్‌పూర్ సర్వే నంబర్ 274,75, 76,77,78,81 లోని సీలింగ్ భూముల్లో రైతులకు 125 ఎకరాలకు సంబంధించి పట్టాపాసు పుస్తకాలు జారీచేయడంతో పాటు, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం అనాజ్‌పూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలి పారు. నిరసనలో జాన్‌వెస్లీతో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, పహాడీషరీఫ్ ఠాణాకు తరలించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నర్సింహ, నాయకులు శివకుమార్, ముత్యాలు, సుమలత, లింగస్వామి, బాలరాజు, యాదయ్య, భిక్షపతి, జంగయ్య, రాములు, మహేశ్, రవి, రైతులు పాల్గొన్నారు.