
పంజగుట్ట కూడలిలో బ్రిడ్జిని తాకిన విగ్రహం
పంజగుట్ట: వినాయకుని విగ్రహం తరలిస్తున్న వాహనం పంజగుట్ట కూడలి వద్ద బ్రిడ్జికి తాకడంతో వాహనం రోడ్డుపైనే ఆగిపోయి కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం ఓ పెద్ద డీసీఎంలో భారీ వినాయకున్ని తీసుకుని పంజగుట్ట నుండి అమీర్‌పేట వైపునకు వెళ్తుండగా..పంజగుట్ట కూడలి వద్ద పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి అడ్డంకిగా మారింది. దీంతో వాహనాన్ని అక్కడే ఆపేశారు. రోడ్డు మధ్యలో వాహనం ఆగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని బంజారాహిల్స్ వైపునకు మళ్లించడంతో అక్కడ వాహనం సాఫీగా వెళ్లిపోయింది.