
జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
చేవెళ్ల: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు జీఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏడాదికి రెండు జతల యునిఫాం, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 19, 20 తేదీలలో జిల్లాలోని తుర్కయంజాల్‌లో నిర్వహించనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చేవెళ్ల మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా జి.నరేశ్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ నరేశ్, కోశాధికారిగా సిద్దమ్మ, ఉపాధ్యాక్షులుగా దస్తగిరి, భాస్కర్, నర్సింలు, సహాయ కార్యదర్శులుగా జనార్ధన్, అఫ్జల్, మహేందర్, కిష్టయ్య, కమిటీ సభ్యులుగా మాణిక్యం, మల్లమ్మ, జంగమ్మ, అడివమ్మ, శివయ్య, శ్రీనివాస్ తదితరులను నియమించారు.
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
ఆమనగల్లు: ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను విస్మరిస్తోందని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.కిషన్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యూనియన్ ఆమనగల్లు విభాగం 3వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ మాట్లాడుతూ.. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని.. చాలీ చాలని వేతనాలతోనే నెట్టుకొస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. రెండవ పీఆర్సీలో రూ.26వేల కనీస వేతనం అమలు చేయాలని, 60 ఏళ్లు పైబడిన, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉపాధి కల్పించాలని.. రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇంజమూరి నర్సింహ, శివశంకర్, వగ్గు రవి, హంసమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా నర్సింహ, కోశాధికారిగా గోపాల్, ఉపాధ్యక్షురాలిగా హంసమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్, సహాయ కార్యదర్శిగా గణేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విజయ్‌కుమార్, సభ్యులుగా యాదమ్మ, పద్మ, సుగుణమ్మ, సుధాకర్, చిట్టిబాబు, రాములు, శివ, శ్రీను నియమితులయ్యారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి

జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి