
ఫ్లైవుడ్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సలీమ్ గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్‌లై వుడ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఇందులో మల్టీ పర్పస్‌గా వెల్డింగ్, ప్‌లైవుడ్, సోఫాల తయారీతో పాటు మేకలు, కోళ్లను పెంచుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ అగ్నిమాపక అధికారి చంద్రనాయక్ నేతృత్వంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే చాంద్రాయణగుట్ట నుంచి అగ్నిమాపక కేంద్రంతో పాటు గౌలిగూడ నుంచి రోబోటిక్ యంత్రాన్ని రంగంలోకి దించి మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని మూగజీవాలు మంటల్లో చిక్కుకుపోయి చనిపోయాయి. కోళ్లు, రెండు మేకలు మృతి చెందాయి. ప్రమాదానికి గల కారణంగా ఇంకా తెలియరాలేదని అగ్నిమాపక అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కాటేదాన్‌లో ఫైర్ వాహనాలు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో గౌలిగూడ నుంచి రోబోటిక్ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి మంటలు ఆర్పారు.
హిందూ ఉత్సవ సమితి స్థల అభివృద్ధికి కృషి
తాండూరు: హిందూ ఉ త్సవ కేంద్ర సమితికి కేటాయించిన స్థలంలో పండుగలు జరుపుకునేందుకు వేదికగా మండపాలను నిర్మిస్తామని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, హిందూ ఉత్సవ సమితి చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని ఖాంజాపూర్ గేట్ వద్ద హిందూ ఉత్సవ కేంద్ర సమితి స్థలంలో బోరు వేయించారు. స్వప్నపరిమళ్, పట్లోళ్ల నర్సింహులు, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, సందల్ రాజుగౌడ్ సంఘం సభ్యులతో కలిసి పూజలు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులు సంతోశ్ కుమార్, భానుకుమార్, రామకృష్ణ, నాయకులు ప్రభాకర్‌గౌడ్, రామకృష్ణ, ప్రవీణ్‌గౌడ్, పటేల్ కిరణ్, వేణుగోపాల్, శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులున్నారు.

ఫ్లైవుడ్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం