
ప్రజాసేవే ఉద్యోగుల ధర్మం
మొయినాబాద్: ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల ధర్మమని.. ప్రజలతో కలిసి పనిచేసే ఉద్యోగులను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. మొయినాబాద్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించిన గణేశ్ జూలై 31న ఉద్యోగ విరమణ పొందారు. ఆదివారం మొయినాబాద్‌లో ఆయన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిషన్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగులకు సాధారణమే అయినా ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులన్నీ ఇలాంటిస సమయంలోనే గుర్తొస్తాయన్నారు. ప్రతి ఉద్యోగి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, గణేశ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఏసీపీ కిషన్