వసూళ్ల పర్వం! | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల పర్వం!

Aug 25 2025 8:58 AM | Updated on Aug 25 2025 8:58 AM

వసూళ్

వసూళ్ల పర్వం!

సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025
లొసుగుల ముసుగులో

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులు.. చిన్నచిన్న అంశాలను సాకుగా చూపించి పెద్దమొత్తంలో దోచుకుంటున్నారు. అనధికారిక వెంచర్లలో నాలా కన్వర్షన్‌ కాని ఖాళీ స్థలాలు, జీపీ లే అవుట్లలో ప్రజావసరాల కోసం వదిలిన పార్కు స్థలాలు, గ్రామ కంఠం భూముల్లో వెలసిన నిర్మాణాలు, లీగల్‌ హైర్‌లేని జీపీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వీరి పాలిట వరంగా మారాయి. దీంతో జిల్లాలోని పలువురు సబ్‌రిజిస్ట్రార్ల(ఎస్‌ఆర్‌ఓ)కు కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేట్‌ ఫిక్స్‌ చేసి వసూలు చేస్తున్నారు.

మధ్యవర్తుల సాయంతో..

ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అవుతుండగా వీటిద్వారా ప్రభుత్వానికి రూ.360 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్న కొంతమంది ఇందుకోసం పెట్టిన ఖర్చును రాబట్టుకునేందుకు డాక్యుమెంటుకో రేట్‌ పెట్టి వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలా ఒక్క గండిపేటకే నలుగురు అధికారులు వచ్చివెళ్లారు. లీగల్‌ హైర్‌ లేని, పాత లే అవుట్లలో ఏలింకూ లేని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు రూ.పది లక్షల నుంచి రూ.పదిహేను లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గ్రామ కంఠం, అర్బన్‌ సీలింగ్‌, 111 జీఓ పరిధిలోని భూముల్లో వెలిసిన బహుళ అంతస్తుల భవనాల్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందుకోసం డాక్యుమెంట్‌ రైటర్లు, పర్సనల్‌ డ్రైవర్లను మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారు. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో మధ్యవర్తుల నుంచి సొమ్ము తీసుకెళ్తున్నారు.

మచ్చుకు కొన్ని..

● కోర్టు పరిధిలో ఉన్న సికిందర్‌గూడలో పది ఎకరాల వివాదాస్పద భూమికి రాత్రికి రాత్రే నాలా కన్వర్షన్‌ ఉత్తర్వులు జారీ చేయడం, ఓ తెల్ల కాగితంపై లే అవుట్‌ గీయడం, ఖాళీ ప్లాట్లకు బండ్లగూడ మున్సిపాలిటీ ఇంటి నంబర్లు జారీ చేయడం, ఆ వెంటనే 23 ప్లాట్లకు సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం ఇటీవల స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విలువైన ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

● లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ లేదనే సాకుతో రాళ్లగూడ ప్రకాశ్‌నగర్‌లోని 250 గజాల చొప్పున ఉన్న రెండు ఏజీపీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు శంషాబాద్‌ ఎస్‌ఆర్‌ఓ ఆరు మాసాల క్రితం రూ.2 లక్షలు వసూలు చేశారు.

● మెయినాబాద్‌ సర్వే నంబర్‌ 176/23లోని 0.33 ఎకరాల లావణి పట్టా భూమిని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్‌ చేయించారని, ఈ భూములకు సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేశారని, తమకు తెలియకుండా తమ భూములకు నాలా కన్వర్షన్‌ చేయించి, గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు నాగమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించడం, ఆ మేరకు అసైన్డ్‌ భూములకు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం సబ్‌ రిజిస్ట్రార్లకు లేదని ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు.

కనెక్షన్‌.. కలెక్షన్‌!

ఆస్తుల రిజిస్ట్రేషన్లలో లోపించిన పారదర్శకత

ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు

అక్రమాలకు నిలయంగా పలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు

ఏసీబీకి చిక్కుతున్నా మారని తీరు

వసూళ్ల పర్వం!1
1/2

వసూళ్ల పర్వం!

వసూళ్ల పర్వం!2
2/2

వసూళ్ల పర్వం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement