విద్యుత్‌ తీగల చోరీ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగల చోరీ

Aug 24 2025 9:48 AM | Updated on Aug 24 2025 2:00 PM

విద్య

విద్యుత్‌ తీగల చోరీ

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కడ్తాల్‌: బీవీఆర్‌ వెంచర్‌లో విద్యుత్‌ వైర్ల చోరీ ఘటన మరువక ముందే.. శుక్రవారం రాత్రి మ రో వెంచర్లో 20 స్తంభాల నుంచి విద్యుత్‌ తీగలను కత్తిరించుకు వెళ్లారు. ఈ ఘటన కడ్తాల్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్‌ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని టోల్‌గేట్‌ సమీపంలో జేజేఆర్‌ వెంచర్లో ఈ నెల 22న రాత్రి గుర్తు తెలియని దుండగులు విద్యుత్‌ వైర్లను అపహరించారు. శనివారం ఉదయం వెంచర్‌ యజ మాని రాధాకిషన్‌ రెడ్డి వెళ్లిచూడగా విద్యుత్‌ తీగ లు కనిపించ లేదు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

డీగ్రీ ప్రవేశానికి గడువు పెంపు

ఇబ్రహీంపట్నం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశానికి గడువును ఈ నెల 30 వరకు పెంచామని అధ్యాపకుడు డా.ఈ.శంకర్‌ తెలిపారు. శనివారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్‌ రాధికతో కలిసి వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్కువ ఫీజుతో డిగ్రీ కోర్సులను పూర్తి చేసే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పించిందని తెలిపారు. రెగ్యులర్‌ కోర్సులతో దూరవిద్య సమానమేనని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9441512966 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేశ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి

మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి

ఇబ్రహీంపట్నం: వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సూచించారు. శనివారం ఓ ఫంక్షన్‌ హాల్‌లో డివిజన్‌ స్థాయిలో గణేశ్‌ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. శాంతియుతంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల, ఫార్మాసిటీ, ఆధిబట్ల, మాడ్గుల సీఐలు, విద్యుత్‌ ఏఈ, ఇరిగేషన్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రాజేంద్రనగర్‌: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మామిడి కిశోర్‌ ప్రకారం... శివరాంపల్లి పిల్లర్‌ నంబర్‌ 3వ వద్ద ఓ యువకుడు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటన స్థలా నికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. యువకుడి వయ స్సు 30–35 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలి పారు. మృతుడు స్థానికంగా భిక్షాటన చేస్తూ ఉండేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మా ర్చురీకి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే ఉస్మానియా మార్చురీ సిబ్బంది లేదా రాజేంద్రనగర్‌ పోలీసులను సంప్రదించాలన్నారు.

విద్యుత్‌ తీగల చోరీ 
1
1/1

విద్యుత్‌ తీగల చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement