
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
కేశంపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానంతో ఐసీడీఎస్, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ఉందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ప్రీప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని కోరుతూ ఎంఈఓ చంద్రశేఖర్‌కు అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ అంగన్‌వాడీ టీచర్లు సీఐటీయూ మండల కన్వీనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ప్రముఖులు మనన్నలు పొందిన ఐసీడీఎస్ వ్యవస్థను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్య కారణంగా సంవత్సరాల లోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల పైన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చిన్నారులకు విద్యకంటే పౌష్టికాహారం ముఖ్యమన్నారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు బోధనా బాధ్యతలను అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకే అందించాలన్నారు. విద్యా వలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు అదనంగా అందించాలన్నారు. ఆరేళ్లలోపు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు సంబంధం లేని బీఎల్‌ఓ తదితర అదనపు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు శశికళ, లక్ష్మి, శివలీల, సుగుణ, సుమలత, సుష్మ, సుమతి, నిర్మలమ్మ, విజయలక్ష్మి, నిర్మల, వినోద, జయమ్మ, భాగ్యలక్ష్మి, అమృత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు