
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి
ఇబ్రహీంపట్నం: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బస్టాండ్ వద్ద చేపటిన దీక్షలో ఫెడరేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు పి.జగన్, డివిజన్ అధ్యక్షుడు వంశీ, కార్యదర్శి తరంగ్‌లు మాట్లాడారు. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.8,150 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఫీజు చెల్లించని కారణంగా పై చదువుల కోసం విద్యార్థులు కళాశాలల యాజమాన్యం వద్దకు వెళితే.. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని మొండికేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జస్వంత్, వినయ్, ప్రదీప్, కిషోర్, నగేష్, విజయ్, రాకేష్, చరణ్, శరత్‌లు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్