
గన్‌తో బెదిరించి తండ్రీ కొడుకులపై దాడి
విజయనగర్‌కాలనీ: గన్‌తో బెదిరించి కత్తితో దాడిచేసిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళ్‌హాట్‌కు చెందిన ఓ బాలుడు (16) ఈ నెల 22న మెహిదీపట్నంలోని మజీద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ సెయింటాన్స్ బాలికోన్నత పాఠశాల వద్దకు రాగానే ఓ స్కార్పియో కారులో వచ్చిన కొందరు యువకులు పక్కకు తప్పుకోవాలంటూ అతన్ని దుర్భాషలాడుతూ...వాహనాన్ని ఆపి గన్‌తో బెదిరించారు. భయబ్రాంతులకు గురైన ఆ యువకుడు తన తండ్రి అఫ్సర్ అలీ సయ్యద్ ఫారూఖ్‌కు సమాచారం అందించాడు. అక్కడకి చేరుకున్న ఫారూఖ్ విషయం ఏంటని ప్రశ్నించగా..అతడిపై కూడా కత్తితో దాడిచేశారు.