
వ్యక్తి అదృశ్యం
మొయినాబాద్: మద్యం సేవించవద్దన్నందుకు భార్యతో గొడవపడిన వ్యక్తి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి చిలుకూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధ/లోని చిలుకూరు ఇంద్రారెడ్డినగర్ కాలనీలో నివసిస్తున్న సయ్యద్ రసూల్ భార్య నజ్నిన్ శుక్రవారం రాత్రి మద్యం తాగొద్దంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రసూల్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.