
యూరియా కొరత లేకుండా చూడండి
షాద్‌నగర్‌రూరల్: రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావుకు విన్నవించారు. శుక్రవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో వ్యవసాయానికి సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లేడుచౌదరిగూడ మండలానికి వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి తుమ్మలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వినతి