
మజీద్‌పూర్ స్కూల్‌ను సందర్శించిన గుజరాత్ బృందం
అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలోని మజీద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలను గుజరాత్ విద్యాఽశాఖాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 80 మంది విద్యాధికారులు ప్రత్యేక పర్యటనలో భాగంగా సందర్శించి తెలంగాణ విద్యా రంగంలో చేసిన మార్పులను తెలుసుకున్నారు. మన తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాటతో అమ్మఆదర్శ కమిటీ సభ్యులు అలరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పి.సుశీందర్‌రావు, స్టేట్ సీఎంవో కె.జోసెఫ్, ఏఎంవో జయచంద్రారెడ్డి, రంగారెడ్డి సీఎంవో వెంకటేశ్వర్లు, ఎంఈవో జగదీశ్వర్, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ రమేష్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మహేశ్ పాల్గొన్నారు.